బ్యాంక్ మేనేజర్ అరెస్ట్…
దిశ దశ, హైదరాబాద్:
ఆరు కరెంట్ అకౌంట్ల ద్వారా రెండు నెలల్లో రూ. 175 కోట్ల లావాదేవీలు జరిపిన కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ స్కాంకు కారుకులైన ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లోని షంషీర్ గంజ్ ఎస్బీఐ మేనేజర్ బాబు గాలి, జిమ్ ట్రైనర్ ఉపాధ్యాయ సందీప్ శర్మలను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ అక్రమ లావాదేవీలు చేసిన నేరస్తులతో చేతులు కలిపిన వీరు ఇద్దరు కూడా కమిషన్లు తీసుకుని అకౌంట్లలోకి డబ్బు మళ్లించినట్టుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల దర్యాప్తులో తేల్చారు. దీంతో వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడంతో ఇంకా ఈ కేసులో మరింతమందిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.