జీతంతో పాటు… ప్రోత్సాహమూ అందిస్తాం…

బిగ్ టీవీ మరో బిగ్ డెసిషన్…

దిశ దశ, హైదరాబాద్:

ఆర్థిక వనరుల సమీకరణే లక్ష్యంగా పని చేస్తూ… సంస్థకు రెవెన్యూ ఇచ్చే వారికి మాత్రమే గుర్తింపు ఇస్తున్న సమయమిది… జర్నలిస్టులు కూడా న్యూస్ యాంగిల్స్ ను పక్కన పెట్టి పని చేస్తున్న సంస్థలు ఇచ్చే టార్గెట్ల కోసం కలెక్షన్ పైనే కాన్సంట్రేషన్ చేస్తున్న సమయం ఇది… ఇలాంటి తరుణంలో తెలుగు ప్రేక్షకుల ముందు వాలిన బిగ్ టీవీ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జర్నలిస్టు వ్యవస్థకు కాలం చెల్లిపోయిందన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ టీవీ తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సంస్థలకు అనుకూలమైన వార్తల ప్రవాహాన్ని అందిస్తూ… వాటి ఆర్థిక ఎదుగుదలకు నిరంతరం పని చేయాల్సిన పరిస్థితుల్లో బిగ్ టీవీ యాజమాన్యం తీసుకున్న మరో నిర్ణయం ఆదర్శవంతం.

జర్నలిస్టులకు గుర్తింపు…

పని చేస్తున్న సంస్థలో వేతనాలు అందించే పరిస్థితి ఉంటే చాలని, రెవెన్యూ తీసుకరావాలని టార్గెట్లు ఫిక్స్ చేయకుంటే ఎంతో మంచిదని భావిస్తున్న జర్నలిస్టు సమాజానికి బిగ్ టీవీ తాజాగా తీసుకున్న బిగ్ డెసిషన్ ఆదర్శప్రాయమనే చెప్పాలి. సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలని భావించిన సంస్థ న్యూస్ యాంగిల్స్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంది. ఇందులో భాగంగా మే నుండే ప్రారంభించిన కొత్త విధానంతో తమ సంస్థంలో పనిచేసే జర్నలిస్టులకు ప్రోత్సాహం అందించాలని భావించింది. ఈ మేరకు ప్రతి నెల అత్యున్నతమైన కవరేజ్, వైవిద్యమైన న్యూస్ ప్రజెంట్ చేసిన జర్నలిస్టుకు, వీడియో జర్నలిస్టులకు పారితోషికం ఇస్తున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని న్యూస్ కవరేజీని పరిశీలించి వాటిలో మంచి వార్తా కథనాలను గుర్తించి నెల నెల జర్నలిస్టులకు ప్రోత్సహకాలు అందిస్తోంది. వీటితో పాటు సంవత్సరం ముగిసిన తరువాత ఆ ఏడాదిలో ది బెస్ట్ న్యూస్ ను సెలెక్ట్ చేసి ఆ వార్తలను కవర్ చేసిన జిల్లా ఇంఛార్జి, వీడియో జర్నలిస్టుకు నగదు ప్రోత్సాహకాలు అందించాలన్న నిర్ణయం తీసుకుంది. దశాబ్దంన్నర కాలంగా జర్నలిస్టులుగా న్యూస్ కవర్ చేయడంతో పాటు రెవెన్యూ కలెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితులు తయారయ్యాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు అయితే జర్నలిస్టులచే రెవెన్యూ కలెక్షన్ చేయడమే పనిగా పెట్టుకున్నాయన్న విమర్శలు వస్తుండగా, కొన్ని సంస్థలు మీడియా ముసుగేసుకుని మరీ డబ్బుల వసూల్లే లక్ష్యంతో ముందు సాగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానికి మీడియా రంగంలోకి అడుగుపెట్టిన బిగ్ టీవీ జర్నలిస్టులను ప్రోత్సహించాలన్న లక్ష్యం పెట్టుకోవడం… అందునా న్యూస్ యాంగిల్స్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. కొత్తగా మీడియా రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ తమకు ఆర్థిక వనరులు పరమావధి కాదని, వైవిద్యమైన వార్తలకు కేరాఫ్ గా ఉంటామని బిగ్ టీవీ చేతల్లోనే చూపిస్తుండడంతో జర్నలిస్టుల్లో నూతనోత్సాహం నెలకొంటోంది.

You cannot copy content of this page