దిశ దశ, జగిత్యాల:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ధర్మపురి ఈవీఎంల స్ట్రాంగ్ రూం వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితం జగిత్యాల జిల్లా మల్యాల మండలం వీఆర్కే కాలేజీలోని ఈవీఎంల స్ట్రాంగ్ తాళలు పగలగొట్టి జిల్లా అధికారులు వెల్లిన సంగతి తెలిసిందే. అయితే స్ట్రాంగ్ రూం లోపల ఉన్న ఈవీఎంలు, ఇతర రికార్డులు భద్రపర్చే ట్రంకు పెట్టెల తాళం చెవులు కూడా దొరకకపోవడం విస్మయం కల్గిస్తోంది. సాధారణంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికల కమిషన్ నిభందనల ప్రకారం ఈవీఎంలను భద్రపర్చేందుకు నిర్ణీత గడువు ఉంటుంది. అప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్స్ కు సంబంధించిన తాళం చేతులు, వాటిలోపల భద్రపర్చిన ట్రాంకు బాక్సుల తాళం చెవులు జిల్లా రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెండ్ రిటర్నింగ్ అధికారి సేఫ్ కస్టడీలో ఉండాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలపై కోర్టులను ఆశ్రయించినప్పుడు వాటిని మరింత భద్రంగా దాయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. హై కోర్టులో విచారణ జరుగుతున్న ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం విషయంలో అధికారుల తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే స్ట్రాంగ్ రూం తాళం చెవులు మిస్ కావడమే సంచలనంగా మారగా ఇప్పుడు లోపల ఉన్న కొన్ని ట్రంక్ బాక్సుల కీస్ కూడా మిస్సయ్యాయని తేలింది.
నిర్లక్ష్యానికి నిదర్శనం: అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం భద్రపర్చే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ లాక్స్ బ్రేక్ చేసిన తరువాత ట్రంకు బాక్సులను ఓపెన్ చేస్తున్న క్రమంలో కొన్ని బాక్సులకు సంబంధించిన కీస్ కూడా మిస్సయ్యాయన్న విషయం గుర్తించారని మీడియాకు తెలిపారు. అధికారులు ఈ విషయంలో ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం కాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. జిల్లా అధికార యంత్రాంగం వద్ద ఉండాల్సిన స్ట్రాంగ్ రూం కీస్ అదృశ్యం కావడమే తప్పిదమంటే ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ రూం లోపల ఉన్న తాళం చెవులు కూడా లేకుండా పోవడం ఏంటని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఇందులో అమర్చిన సుమారు 20 ట్రంకు బాక్సులకు అసలు తాళలే లేవని, కేవలం నాలుగు పెట్టెలకు మాత్రమే తాళాలు ఉన్నాయని వివరించారు. 17ఏ, 17సి ఫామ్స్ బాక్సుల తాళం చేతులు కూడా లేకపోవడంతో వాటి తాళాలు కూడా పగలగొట్టారని వివరించారు. రాష్ట్ర, జిల్లా వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post