నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్…
దిశ దశ, ఏపి కరస్పాండెంట్:
వైఎస్ కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతోందా..? హత్యకు గురైన వైఎస్ వివకానంద ఫ్యామిలీయే లక్ష్యంగా కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా..? వివేకా రెండో భార్యగా చెప్తున్న ఆమె కీలక ఎత్తుగడతో ముందుకు సాగబోతున్నారన్న ప్రచారం నెట్టింట సాగుతోంది.
కోర్టులో పిటిషన్..?
వైఎస్ వివేకా రెండో వివాహం చేసుకున్నారని వీరిద్దరికి ఓ వారసుడు కూడా జన్మించాడని ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్ వివేకానంద రెండో ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే నెట్టింట షేర్ అయ్యాయి. అయితే తాజాగా రెండో భార్య కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయంటు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కుటంబం పేరిట క్రియేట్ చేసిన ఓ ట్విట్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. వచ్చే సోమవారం నాడు వివేకా రెండో భార్య షేక్ షేమేమ్మ్ తను, తన కొడుకు పేరిట వివేకానంద రాసిచ్చిన వీలునామా ఆధారంగా ఆస్థి ఇవ్వాలని కోరుతూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఈ ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు. డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకోవచ్చని తనకు రావాల్సిన వాట ఇప్పించాలని కోరుతూ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించనుందని ట్విట్ లోని సారాంశం. అయితే ఉన్నట్టుండి వివేకా రెండో భార్య కేంద్రీకృతంగా సాగుతున్న ఈ ప్రచారంతో మరో కోణంలో ఆ కుటుంబం గురించి చర్చించుకునే పరిస్థితి తయారైందని చెప్పవచ్చు. ఏది ఏమైనా వివేకా రెండో భార్యగా చెప్తున్న ఆవిడ హై కోర్టును ఆశ్రయిస్తే మరో సంచలనానికి ఆ కుటుంబం వేదిక కానుంది.