ఇనుముల సతీష్ పై మరో కేసు నమోదు…

దిశ దశ, మంథని:

తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, తనను చంపేందుకు కుట్ర పన్నారని ఇనుముల సతీష్ ఆరోపణలు చేస్తున్నా కేసుల నమోదు ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని రామగిరి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేశారు పోలీసులు. సైండ్ల తిరుపతి రెడ్డి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 329(3), 351(3), 308(5), r/w3(5) బీఎన్ఎస్ యాక్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన విషయంలో తనను బెదిరించి రూ. 10 లక్షలు బలవంతంగావసూలు చేశారని తిరుపతి రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల శివారులోని భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ తన గన్ మెన్ తో వచ్చి బెదిరించాడని తెలిపారు. గత జూన్, జులై నెలల్లో  ఈ ఘటన జరిగిన తరువాత ఆగస్టు 20న మంథని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రకియ కొనసాగిస్తున్నప్పుడు కూడా వచ్చి తనకు రూ. 20 లక్షలు ఇవ్వాలని లేనట్టయితే చంపుతానని బెదిరింపులకు గురి చేశాడని తిరుపతి రెడ్డి పోలీసులకు వివరించారు. అయితే ఈ వ్యవహారాన్ని తాను డీల్ చేస్తానని రావికంటి సతీష్ అనే వ్యక్తి జోక్యం చేసుకుని రూ. 10 లక్షలు ఇస్తే సరిపోతుందని ఒప్పించినట్టుగా వెల్లడించాడని తెలిపారు. దీంతో రావికంటి సతీష్ కు చెందిన యూనియన్ బ్యాంక్ అకౌంట్ A/C NO: 084310027000013కు కస్టమర్ రాపెల్లి సత్తయ్య అకౌంట్ నంబర్ 084310021010872, చెక్ నంబర్ 006111 ద్వారా రూ. 10 లక్షలు బదిలీ చేశామని ఫిర్యాదులో వివరించారు. అనంతరం సత్యనారాయణ సూచనల మేరకు తమ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించుకున్నామని వివరించారు. సైండ్ల తిరుపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనుమల సతీష్, రావికంటి సతీష్ లపై కేసు నమోదు చేశామని రామగిరి పోలీసులు తెలిపారు. 

You cannot copy content of this page