మరో వివాదంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే

వైరల్ అవుతున్న ఆడియో, వీడియో

దిశ దశ, మంచిర్యాల:

మంచిర్యాల జిల్లాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో, వీడియో కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీకి చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ మాట్లాడుతున్న ఆడియో, మరో వ్యక్తితో వాట్సప్ ఛాటింగ్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. గతంలో ఓ టోల్ గేట్ నిర్వహకులపై చిన్నన్న దాడికి పాల్పడ్డారంటూ సీసీ ఫుటేజీ విడుదల చేశారు. ఆ తరువాత రోడ్డు నిర్మాణం కాకున్నా టోల్ వసూళ్లేంటని నిలదీశానని ఎమ్మెల్యే చిన్నయ్య ప్రకటించారు. తాజాగా మంగళవారం విడుదల అయిన ఆడియో, వీడియోలపై చర్చ జరుగుతోంది. ఓ ప్రైవేట్ డెయిరీ నిర్వాహకునితో మద్య కోడ్ భాషలో యువతి విషయం లో చాటింగ్ చేస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. సెల్ ఫోన్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ కు సంబంధించిన ఈ వీడియోలో లొకేషన్ కూడా షేర్ చేసినట్టుగా కూడా ఉంది. ఆరిజన్ డైయిరీలో పార్టనర్ గా ఉన్న మహిళనని చెప్తున్న మాటలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే తమ వద్ద డబ్బులు తీసుకొని తప్పుడు కేసు లు పెట్టించారని, తానోసారి ఎమ్మెల్యేను కలిసేందుకు వెల్లిన తన వెంట ఉన్న అమ్యాయిని పంపించాలన్నడని ఆమె ఆరోపిస్తున్నారు. ఓ సారి ఇంటికి పిలిపించి పోలీసులకు అప్పచెప్తే వాళ్లు తనను స్టేషన్ కు తీసుకెళ్లి హెచ్చరించారని, తనకు అన్యాయం జరిగిదంటే తమ పరిధి కాదని పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని కూడా ఆరోపిస్తున్నారు. లక్షెట్టిపేట పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వ్యక్తిగతంగా రావాలన్నారని, ఆన్ లైన్ లో కంప్లైంట్ చేసిన తీసుకోమని చెప్పారని మహిళ వివరిస్తున్నారు. మొత్తం 5.47 సెకన్ల ఆడియో తెలంగాణలోని పలు జిల్లాల్లో వైరల్ అవుతోంది. తనకు న్యాయం చేయాలని సదరు మహిళ ఆడియోలో కోరుతుండడం గమనార్హం.

నిఘా వర్గాల ఆరా..

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే చిన్నయ్య ప్రమేయం ఎంతమేర ఉంది, మహిళ చేస్తున్న ఆరోపణల గురించి సమగ్రంగా వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. వాట్సప్ ఛాటింగ్ గురించి కూడా ఆరా తీస్తున్న నిఘావర్గాలు ఇప్పటికే ప్రాథమిక నివేదికలు ఉన్నతాధికారులకు పంపించినట్టు సమాచారం. పూర్తి వివరాలు సేకరించిన తరువాత నివేదిక అంతా కూడా ప్రగతిభవన్ కు పంపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా చూపిస్తున్న వీడియో గురించి సాంకేతికతను అందిపుచ్చుకుని క్లారీటీగా తెలుసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తు విడుదలైన ఆడియో ఇదే

You cannot copy content of this page