కేంద్రం మదిలో మరో దర్యాప్తు సంస్థ

అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సరికొత్త వ్యూహం

దిశ దశ, న్యూ ఢిల్లీ:

అవినీతి పరులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (సీఐఓ) పేరిట ఏర్పాటు చేయనున్న ఈ విభాగం ఆధ్వర్యంలో అవినీతిని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విభాగానికి సంబంధించిన విది విధానాలు రూపొందించినట్టుగా సమాచారం. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కి చీఫ్ గా వ్యవహరించే అధికారినే సీఐఓ చీఫ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. తొలి చీఫ్ గా సంజయ్ మిశ్రా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)తో ఈ సంస్థకు నేరుగా సంబంధాలు ఉండనున్నాయి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడిఎస్) తరహాలోనే సీఐఓ పనిచేయాల్సి ఉంటుంది.

You cannot copy content of this page