చిరంజీవి ఖాతాలో మరో రికార్డు.. అది ‘వాల్తేరు వీరయ్య’కే సాధ్యం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను సంపాదించింది. ఆచార్య లాంటి ప్లాఫ్ తర్వాత ఈ సినిమాతో మళ్లీ చిరంజీవి హిట్ అందుకున్నాడు. చిరంజీవితో పాటు రవితేజ కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమా విజయం సాధించగలిగింది. చిరంజీవి స్ట్రైల్ మాస్ స్టెప్పులు, రవితేజ మాస్ డైలాగ్‌లు ఫ్యాన్స్‌కు గూస్బమ్స్ తెప్పించాయి. అయితే ఈ సినిమా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ రోజుల్లో 50 రోజులు సినిమా ఆడటం చాలా కష్టం. కానీ వాల్తేరు వీరయ్య మొత్తం 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. అందులో మార్చి 3తో 70 డైరెక్ట్ సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఓటీటీలో కూడా వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అవ్వగా.. అయినా 100కిపైగా సెంటర్లలో 50 రోజులు ఆడటమంటే గ్రేట్ అని చెప్పుకొవచ్చు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు 50 రోజులు ఆడటంతో.. ఆ డైలాగ్‌కు సరిపోయేలా ఈ సినిమా విజయం సాధించిందని మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. అలాగే ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు కూడా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది.

You cannot copy content of this page