దిశ దశ పెద్దపల్లి:
అమవాస్య వచ్చిందంటే చాలు ఏ గ్రామ శివార్లలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అమవాస్య రోజున క్షుద్ర పూజలు చేస్తే అతీంద్రయ శక్తుల తమ ఆధీనంలోకి వచ్చి ఏవేవో ఘనకార్యాలు సాధిస్తామన్న భ్రమల్లో మంత్రగాళ్లు అర్థరాత్రి వేళల్లో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు. అమావాస్య వచ్చి తెల్లవారిందంటే చాలు గ్రామ శివార్లలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగులోకి వస్తుండడంతో వాటి వంక వెల్తే తమకేమైనా అవుతుందేమోనన్న భయంతో సామాన్యులు గజగజ వణికిపోతున్నారు. కొంతమంది మూడనమ్మకాల జాఢ్యంలో కొట్టమిట్టాడుతున్న ఇలాంటి వారిని నమ్మడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్ర పూజల కలకలం సృష్టిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అమవాస్య రోజున మంత్రగాళ్ల క్షుద్ర పూజలు జరుగుతుండడం గమనార్హం. మూడాఛారాలను నమ్మకూడదని పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అవగాహన కల్పిస్తున్న తమ పంథాను మాత్రం వీడేవారే లేరు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడం గమనార్హం.