ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌డోర్సే ‘బ్లూస్కై’ అనే యాప్ బీటా వర్షన్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ట్విటర్‌కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్ సైట్ గా మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్, ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. బ్లూస్కై ప్రస్తుతం ఇన్‌వైట్-ఓన్లీ బీటా వర్షన్ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 17న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటివరకు 2 వేల మంది ఎంపిక చేసిన యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. ట్విటర్‌లో ఉన్న ‘వాట్ ఈజ్ హాపెనింగ్?’ అన్న ఆప్షన్‌కు బదులుగా ఇందులో ‘వాట్స్‌అప్?’ అనే ఆప్షన్ ఉంది. అలాగే బ్లూస్కైలో షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఆప్షన్స్‌తో పాటు కొత్తవారిని కూడా యాడ్ చేసే అడ్వాన్స్‌డ్ ఫీచర్ ఇందులో ఉంది. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కై యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా చాలా సింపుల్‌గా రూపొందించారు. 256 అక్షరాల వరకు నిడివితో యూజర్లు చాలా తేలికగా పోస్ట్‌లు చేయొచ్చు. ప్లస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సులువుగా ఫొటోలు జోడించొచ్చు. ఈ బ్లూస్కై ప్రాజెక్ట్‌ను 2019లోనే అభివృద్ధి చేసినప్పటికీ దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, మరింతగా అభివృద్ధి చేసి 2022లో స్వతంత్ర కంపెనీగా ఆవిష్కరించారు. జాక్ డోర్సే ట్విటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ బ్లూస్కై గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 2022 అక్టోబర్‌లో ఏ యాప్‌తో అయినా సరే పోటీ విధింగా బ్లూస్కైని రూపొందిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేశారు. బ్లూస్కై గతేడాది 13బియన్ డాలర్ల నిధులను సమీకరించింది.