ఎల్‌ఐసీ నుంచి మరో సూపర్ ప్లాన్.. ప్రయోజనాలు ఇవే..

లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆఫ్ ఇండియా(LIC) ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ ను తీసుకొస్తూ ఉంటుంది. కొత్త పాలసీలను తెచ్చుకునేందుకు ప్రజలను ఆకట్టుకునేలా అనేక ప్లాన్లను తీసుకొస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్లాన్ ను ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. జీవన్ ఆజాద్ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాల కలయితో ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది.

జీవన్ ఆజాద్ అనేది లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్. ఈ పాలసీ తీసుకున్నవారు పాలసీ కాల వ్యవధిలో చనిపోతే కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తారు. మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే గ్యారెంటీ ఇచ్చిన మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తారు. అలాగే ఈ పాలసీ ద్వారా లోన్ కూడా తీసుకోవచ్చని లైఫ్ ఇన్యూరెన్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఈ పాలసీ గరిష్ట కాలపరిమితి 20 ఏళ్లు కాగా.. కనీస ప్రాథమిక హామీ రూ2 లక్షలుగా ఉండగా.. గరిష్ట ప్రాథమిక హామీ రూ.5 లక్షలుగా ఉంది.

పాలసీ జరుగుతున్నప్పుడు కానీ లేదా మెచ్యూరిటీ తేదీకి గాని ముందు పాలసీదారుడు మరణిస్తే డెత్ బెనిఫిట్ సదుపాయం ఉంటుంది. కుటుంబానికి ఈ డబ్బులను అందిస్తారు. ఇందుకోసం పాలసీ తీసుకునేటప్పుడు నామినీలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ నామినీలకు ఈ డబ్బులు చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. అలాటే డెత్ బెనిఫిట్ మరణించిన తేదీ వరకు చెల్లించిన ప్రీమియంలో 105 శాతం కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.ఈ పాలసీ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, డబ్బులు పొదుపు చేసుకోడానికి ఉపయోగపడుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీ తీసుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తూ పాలసీదారులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

You cannot copy content of this page