ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. మనీష్ సిసోడియాను మళ్లీ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయి జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఇప్పటికే మూడు రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను ఈడీ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా మనీష్ సిసోడియా ఉన్నాడు. అయితే మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి గత మూడు రోజులుగా తీహార్ జైల్లోనే ఆయనను ఈడీ ప్రశ్నిస్తోంది.

మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనీష్ సిసోడియాను ఈడీ కూడా అరెస్ట్ చేసింది. గురువారం సాయంత్రం 6.20 గంటలకు ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇవాళ దాదాపు 8 గంటల పాటు మనీష్ సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. అనంతరం అరెస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేయడంతో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా మనీష్ సిసోడియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఈడీ అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సీబీఐ అరెస్ట్ చేయడంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. మనీష్ సిసోడియాను ఈడీ కూడా అరెస్ట్ చేయబోతుందని ఇవాళ ఉదయం నుంచి మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే గురువారం సాయంత్రం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను రేపు ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. కోర్టు ఆదేశాల తర్వాత కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా మనీష్ సిసోడియా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మద్యం పాలసీ రూపకల్పన జరిగినట్లు దర్యాపు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి.

You cannot copy content of this page