తన కుటుంబానికి దూరమై… వారితో పాటు అంతమై…

మార్చురీలోనే శాంతయ్య శవం

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ లో జరిగిన ఆరుగురి సజీవదహనం కేసులో హృదయ విదారక సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిసి తల్లి మౌనిక ఈ ఘటనలో మృత్యువు కౌగిట బంధీగా మారిపోగా మరణించిన శాంతయ్య శవం మార్చూరిలో దిక్కుమొక్కులేకుండా పడి ఉంది. కొంతకాలంగా తన కుటంబాన్ని వీటి శివయ్య ఇంట్లోనే నివాసం ఉంటున్న శాంతయ్య శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటనలో సజీవ దహనం అయ్యాడు. అయితే ఈ ఘటనలో చనిపోయిన పద్మ అలియాసర్ రాజ్యలక్ష్మీ, శివయ్య, మౌనిక ఆమె పిల్లలు స్వీటీ, హిమబిందుల మృతదేహాలను వారి బంధువులు తీసుకెళ్లగా శాంతయ్య శవం మాత్రమే ఆసుపత్రి మంచిర్యాల మార్చురీలోనే ఉండిపోయింది. ఆయన కడుపున పుట్టిన బిడ్డలు, భార్య శాంతయ్య శవం స్వాధీనం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఆయన కొంతకాలంగా కలిసి జీవనం సాగిస్తున్న శివయ్య కుటుంబం అంతా కూడా ఆయనతో పాటు కాలి బూడిద కావడంతో శాంతయ్య శవం అనాథ శవంలా మార్చురీలో ఉండిపోయింది. ఒకటి రెండు రోజుల పాటు చూసిన తరువాత అంత్యక్రియలు మునిసిపాలిటీ సహకారంతో చేసే అవకాశాలు ఉన్నాయి.

మరణించినా…

శాంతయ్య బ్రతికి ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి జీవనం చేయకపోవడం వల్ల చనిపోయిన తరువాత అనాథ శవంలా మిగిలిపోవల్సిన పరిస్థితి వచ్చిందా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రక్త సంబంధీకులే ఆయన శవాన్ని తీసుకెల్లే పరిస్థితి లేకుండా చేశారంటే ఎలాంటి దయనీయమైన పరిస్థితికి చేరాడో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు కొందరు. అయితే ఈ ఘటనకు పాల్పడింది కూడా శాంతయ్య కుటుంబీకులేనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. శాంతయ్యకు అంత్యక్రియలు చేస్తామని తమకు సహకరించాలని పోలీసులను కోరేందుకు అతని భార్య పిల్లలు ముందుకు వస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. శాంతయ్యకు, అతని కుంటుంబ సభ్యులకు మధ్య చాలా కాలంగా విబేధాలు ఉన్నాయని సింగరేణి కార్మిక వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

ఆ గొడవ జరగనట్టయితే…?

శుక్రవారం సాయంత్రం వరకు పద్మ ఇంట్లోనే ఉన్న ఆమె తల్లిదండ్రులు ఆ రోజు సాయంత్రం సొంతింటికి వెల్లి పోయారు. ఆ రోజు కూతురు, తండ్రికి మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా పద్మ తల్లిదండ్రులు తమ ఇంటికి వెల్లిపోయారు. ఆ గొడవ జరగనట్టయితే వారు కూడా అదే ఇంట్లో ఉంటే వారు కూడా సజీవ దహనం అయ్యేవారని, వారిద్దరు మృత్యుంజయులేనని అంటున్నారు స్థానికులు.

You cannot copy content of this page