అందాల బ్యూటీ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాత్ర ఇచ్చినా అందులో అవలీలగా ఒదిగిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు. తన నటనతో స్టార్ హీరోస్ అందరి సరసన ఆడి పాడి, స్టార్ హీరోయిన్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది.
గ్లామరస్ పాత్రలలోనైనా, లేడీ ఓరియెంటెడ్ పాత్రలలోనైనా ఈ అమ్మడుకు తిరుగేలదని చెప్పవచ్చు. అరుంధతి సినిమా ఈ ముద్దుగుమ్మ జీవితాన్నే మార్చేశాయి. ఆ తర్వాత బహుబలిలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి అనుష్క తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైందనే చెప్పాలి. బహుబలి మూవీ తర్వాత ఈ నటికి ఎన్నో ఆఫర్స్ క్యూ కట్టినా ఈమె మాత్రం ఏసినిమాకు ఒకే చెప్పలేదంట. దీంతో గత రెండేళ్లుగా అనుష్క నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడు నవీన్ పొలి శెట్టితో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అనుష్కకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అది ఏమిటంటే, అనుష్కకు బహుబలి తర్వాత బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయంట. కానీ వాటన్నింటికీ ఆమె నో చెప్పిందంట. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా ఎలాంటి ఆఫర్స్ లేవు. అయితే దీంతో అనుష్క తనకు వచ్చిన ప్రతీ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు.. తన రేంజ్ వేరేలా ఉండేది. ఆమె బాలీవుడ్ ఆఫర్‌ను వదులుకొని చాలా పెద్ద తప్పు చేసిందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే అనుష్క బాలీవుడ్ ఆఫర్స్‌ను తిరస్కరించడానికి కూడా కారణం లేకపోలేదంటున్నారు అనుష్క ఫ్యాన్స్. అక్కడ బోల్డ్ గా చేయమంటారేమో అని అభిప్రాయంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఆఫర్స్‌ను తిరస్కరించదని సోషల్ మీడియాలో గుస గుసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ దీనిపై సరైన క్లారిటీ మాత్రం లేదు.