పీసీ వీరబాబు వీరత్వం…

డీజీపీ ప్రశంసలు…

ఏపీలో యువతిని కాపాడిన వైనం

దిశ దశ, ఏపీ కరస్పాండెంట్:

యానం వారధిపై జరిగిన ఓ ఘటనలో కానిస్టేబుల్ చేసిన సాహసం హైలెట్ గా నిలిచింది. జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి వంతెనపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అటుగా వెల్తున్న కానిస్టేబుల్ వెనకా ముందు ఆలోచించకుండా నదిలోకి దూకి కాపాడాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని యానం బ్రిడ్జిపై నుండి ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నదిలోకి దూకారు. ఇదే సమయంలో అటుగా వెల్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ వీరబాబు (4724) ఈ విషయాన్ని గమనించి వెంటనే నదిలోకి దూకి నీటిలో మునిగిపోతున్న ఆ యువతిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. జీవితంపై విరక్తి చెందిన ఆ యువతి చనిపోవాలని భావించి నదిలోకి దూకినప్పటికీ వీరబాబు సాహసం చేసి ఆమెను ప్రాణాలతో రక్షించినందుకు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఏపీ పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకోవడంతో నెటిజన్లు కూడా వీరబాబు వీరత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తనకు సంబంధించని విషయం కాదని, తన డ్యూటీ కాదని భావించి వీరబాబు తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించకుండా యువతిని కాపాడిన తీరు ఆదర్శనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా తమ పరిధి కాదంటూ తప్పించుకునే విధానాన్ని అవలంబించే వారికి వీరబాబు ప్రదర్శించిన తీరును ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డ్యూటీతో పాటు మానవత్వాన్ని కూడా ప్రదర్శిస్తే నిరాశ నిసృహలకు లోనయ్యే వారికి భరోసా కల్పించినట్టవుతుంది. ఏ ఆర్ కానిస్టేబులు చూపించిన ధైర్య సాహసం పట్ల ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా అభినందించారు.
https://twitter.com/APPOLICE100/status/1636974871287562240?t=CFk0qbXB1nk0NcUEVhOYHA&s=08

You cannot copy content of this page