మందుపాతర పేలి ఏపీసీ మృతి


దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఒక జవాన్ మృత్యువాత పడ్డారు. నిర్మాణం జరుగుతున్న రోడ్డు వద్ద భద్రాత చర్యలు చేపట్టేందుకు వెల్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా టీమ్నార్ బేస్ క్యాంపు నుండి కొంతమంది జవాన్లు భద్రతా చర్యలు చేపట్టేందుకు వెల్తున్న క్రమంలో ఏటేపాల్ క్యాంపునకు ఒక కిలోమీటర్ దూరంలోని టేక్రీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సీఏఎఫ్ కు చెందిన అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ (APC) విజయ్ యాదవ్ మృత్యువాత పడ్డారు. ఇతనిది ఉత్తరప్రదేష్ లోని బల్లియా జిల్లా రాజ్ పూర్ గ్రామమని పోలీసు అధికారులు వెల్లడించారు. మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగగా ఏపీసీ విజయ్ యాదవ్ కు భైరంగడ్ ఠాణాలో నివాళులు అర్పించారు.

You cannot copy content of this page