అపహరణకు గురైన వస్తువులు ప్రత్యక్ష్యం
దిశ దశ, జగిత్యాల:
ఆలయంలో చోరీకి పాల్పడ్డ దొంగలు తిరిగి ఆ సొత్తును ఆలయం ముందు పడేసి వెల్లిపోయిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం ఆలయంలోకి చొరబడ్డ దొంగలు బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. స్వామి వారికి వినియోగించాల్సిన బంగారు, వెండి వస్తువులను కూడా ఎత్తుకెళ్లిన అగంతకులు తిరిగి శనివారం ఉధయం వాటిని ఆలయ పరిసరాల్లో పడేసి వెల్లిపోయారు. శనివారం ఆలయం సమీపంలో స్వామి వారికి చెందిన వస్తువులు కనిపించడంతో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆలయంలో చోరీ కావడంతో పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని భావించిన అగంతకులు వాటిని ఆలయం సమీపంలో పడేసి తప్పించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. చోరీకి గురైన సొత్తును దేవుడే తెప్పించుకున్నాడని భక్తులు ఆనందపడిపోతున్నారు.