దిశ దశ, మంథని:
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహ కమిటీ సభ్యులు గా శశి భూషణ్ కాచెను రెండో సారి నియమించారు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శశిభూషణ్ కాచె న్యాయవాదిగా, రైతు నాయకుడిగా ఈ కమిటీలో బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కమీషన్ సభ్య కార్యదర్శి వి రాంచందర్ సమాచారం అందించారు.15 మంది వివిద రంగాల నిపుణులతో సలహ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ తెలంగాణ రాజ పత్రం విడుదలైంది. మూడు సంవత్సరాల పాటు ఈ కమిటీ విద్యుత్ రంగ సంస్కరణలు, చట్టబద్ద వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సలహాలు, సూచనలు చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న కమిటీలో కూడా శశిభూషన్ కాచె ఈ కమిటీలో కొనసాగగా, తాజాగా మరోసారి ఈ అవకాశం దక్కింది. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి, విద్యుత్, ఇందన శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న భట్టి విక్రమార్క, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకవచ్చేందుకు తనవంతుగా బాధ్యతలు నిర్వర్తిస్తానని శశిభూషణ్ కాచె అన్నారు. రైతులకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్(గృహ జ్యోతి)తో పాటు వినియోగదారులకు అవసరమైన సేవలందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.