బీఆర్ఎస్ పార్టీకి ఆరెపల్లి మోహన్ రాజీనామా

దిశ దశ, కరీంనగర్:

మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2019లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తాను అధిష్టానం చెప్పిన ప్రతి బాధ్యతను కూడా నెరవేర్చానన్నారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో, కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థలు గెలుపు కోసం పనిచేశానన్నారు. అధిష్టానం చెప్పిన పనిని విధేయతతో నెరవేర్చానని, అయితే మానకొండూరు ఎమ్మెల్యే వ్యవహరశైలిపై తాను పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని కూడా ఆరెపల్లి మోహన్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే పరిస్థితులు లేనందున తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆరెపల్లి మోహన్ ప్రకటించారు.

కూల్ అయినట్టే అయి…

నాలుగు రోజుల క్రితం ఆరెపల్లి మోహన్ అనుచరులతో సమాలోచనలు జరిపి పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావులు చర్చలు జరపడంతో వెనక్కి తగ్గారు. ఈ మేరకు ఆరెపల్లి మోహన్ పార్టీలోనే కొనసాగుతారని జివి ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో ఆరెపల్లి మోహన్ పార్టీలోనే కొసాగుతగారని భావించినప్పటికీ అనూహ్యంగా ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

You cannot copy content of this page