కరీంనగర్ లో మారథాన్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ వేదికగా మారథాన్ నిర్వహించబోతున్నారు. మొట్ట మొదటి సారిగా జిల్లా కేంద్రంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే పనిలో నిర్వహాకులు నిమగ్నమయ్యారు. అక్టోబర్ 8న జరగనున్న ఈ మారథాన్ లో 3 కిలో మీటర్లు, 5 కిలో మీటర్లు, 10, 21.5 కిలోమీటర్ల మేర ఈ మారథాన్ నిర్వహించబోతున్నామని నిర్వహాకులు వెల్లడించారు. ఇందులో 10 కిలో మీటర్ల మారథాన్ 2 గంటల్లోగా, 21.5 కిలో మీటర్ల మారథాన్ ను 3.30 గంటల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని నిర్వహాకులు తెలిపారు. మారథాన్ కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జి నుండి ప్రారంభించాలని నిర్ణయించామని, త్వరలో రూట్ తో పాటు ఎండ్ పాయింట్ కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. ఆసక్తి కల్గిన వారు https://karimnagarmarathon.iq301.com/ లింక్ ద్వారా తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. మారథాన్ లో పాల్గొన్న వారికి టీషర్ట్, మెడల్, డిజిటల్ సర్టిఫికెట్, బ్రేక్ ఫాస్ట్, న్యూట్రిషిన్ సపోర్ట్ అందజేస్తామన్నారు. పరిగెత్తలేకపోయిన వారు జాగింగ్ లేదా, నడవం, కదలడం చేయాలని నిర్వహాకులు సూచిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ కూడదని వారు కోరుతున్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలకు మహేష్: 9676673636, శివ: 9908748899, ప్రవీణ్: 7259265758లను సంప్రదించాలని సూచించారు.

You cannot copy content of this page