ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
దిశ దశ, జగిత్యాల:
పేపర్ల లీకేజీ వ్యవహారం కనుమరుగు కాావాలన్న కారణంతోనే బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… లిక్కర్ స్కాంలో ఎందరినో అరెస్ట్ చేస్తున్న ఈడీ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. గ్రూప్స్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో 30 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, తాజాగా జరిగిన పదో తరగతి ప్రశ్నా పత్రాల లేకేజీలోనూ ప్రభుత్వం అసమర్థత స్పష్టంగా కనపడుతోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ ను కూడా విచారించాలని, ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేస్తే బండారం బయటపడుతుందన్నారు. వాస్తవాలు వెలికితీసేలా ప్రశ్నించినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లపై కేసులు పెట్టారా అని అడిగారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post