దిశ దశ, ఎపీ కరస్పాండెంట్:
మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వివేకానంద హత్య కేసులో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ సాయంత్రానికల్లా ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ భాస్కర్ రెడ్డిని ఏ7గా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. పులివెందుల ప్రభాకర్ రెడ్డిని నుండి నేరుగా హైదరాబాద్ కు భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చిన సీబీఐ అధికారులు వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయగా ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించాలని భావిస్తున్నారు. అయితే సోమవారం ప్రభాకర్ రెడ్డి నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ వేసే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నారు. మరో వైపున ఆదివారం సాయంత్రం ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు సోమవారం మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో జరపనున్న విచారణకు రావాలన్నారు. దీంతో మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కోక తప్పేలా లేకపోగా రేపు దర్యాప్తు సంస్థ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని భావించిన అవినాష్ రెడ్డి ఓ సారి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆయన్ని విచారించిన తరువాత కోర్టులో హాజరు పరుస్తారా లేక మళ్లీ విచారణకు రావాలని సూచిస్తుందా అన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు డీఎస్పీ వాంగ్మూలం ఆధారంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. గతంలో విచారణకు హాజరైనప్పుడు చెప్పిన అంశాలు, సోమవారం చెప్పబోయే సమాధానాలను పరిగిణనలోకి తీసుకుని వాటిని క్రాస్ చెక్ చేసుకున్న తరువాత సీబీఐ అధికారులు ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post