అభ్యర్థులకు పరీక్ష… అమ్మకు విషమ పరీక్ష…

అటు ప్రేమ బంధం… ఇటు విధుల అనుబంధం

దిశ దశ, జగిత్యాల:

మాతృత్వపు మమకారంతో తల్లడిల్లిపోయిన ఆ తల్లిని విధి నిర్వహణ కూడా ముఖ్యమని మనసు హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేయాల్సి వస్తుండడంతో తన కడుపున పుట్టిన బిడ్డ పరిస్థితి ఎలా విలవిలలాడిపోయిందా అమ్మ. చివరకు ఎవరేమనుకున్నా సరే నా డ్యూటీ నేను చేస్తా అనుకుందా తల్లి. తన బిడ్డను ఎత్తుకునే విధులు నిర్వరించిందా అమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరిక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా పలు చోట్ల టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పరీక్షలు సాఫీగా సాగేందుకు పోలీసులు ప్రతి సెంటర్ వద్ద పకడ్భందీగా బందోబస్తు చర్యలు తీసుకోవల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీసులు విధులు నిర్వర్తించారు. అయితే టెట్ పరీక్ష డ్యూటీ పడిన ఓ మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇంట్లో ఆ బిడ్డను చూసుకునే వారు లేకపోవడంతో పాటు పసి వాడిని ఇంట్లో వదిలి డ్యూటీకి వెళ్లేందుకు మనసు ఒప్పుకోకపోవడంతో ఆమె తన కొడుకును ఎత్తుకుని డ్యూటీ చేస్తున్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ వైపున అమ్మతనాన్ని బిడ్డకు పంచుతూ… మరో వైపున డ్యూటీలో నిమగ్నం అయిన ఆ కానిస్టేబుల్ పనితీరును గమనించిన ప్రతి ఒక్కరూ అభినందించారు.

You cannot copy content of this page