బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాలి: అస్సోం సీఎం బిశ్వా శర్మ

లవ్ జిహాదీకి బ్రేకులు… మదర్సాల ముసివేత

దిశ దశ, కరీంనగర్:

బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అస్సోం సీఎం బిశ్వా శర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటనేని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరువేల మదర్సాలు మూయించానని వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలను మూయిస్తానని ప్రకటించారు. ఓవైసీ తనను చూసుకుంటానని బెదింరించాడని ఎక్కడికి రమ్మన్నా వస్తానని, ఓవైసీ ఇంటికి రమ్మన్నా వెల్తానని తనను ఓవైసీ ఏం చేస్తాడో చూడాలని బిశ్వా శర్మ వ్యాఖ్యానించారు. సూర్యుడు ఉన్నంత వరకూ దేశంలో హిందుత్వం, సనాతన ధర్మం కొనసాగుతుందని, ఓవైసీ హిందువులను ఏమీ చేయలేదని హిందూ సమాజం అంతా జాగృతం అయిందని విషయం గమనించాలన్నారు. పదేళ్ల క్రితం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని కానీ ఈ ఏడాది రాముని ఆలయం పూర్తి కాబోతందోన్నారు. అంతరి అంచనాలను తలకిందులు చేస్తూ 370 రద్దు చేశామని, దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ కూడా త్వరలో అమలు కానుందని అస్సోం సీఎం అన్నారు. అప్పుడు భారతదేశం నిజమైన సెక్యూలర్ దేశంగా మారబోతోందని, తెలంగాణాలో రామ రాజ్యం రాబోతుందని అస్సోం సీఎం జోస్యం చెప్పారు. మా రాష్ట్రంలో పెట్రోలో రూ. 98కే లీటర్ దొరికితే తెలంగాణాలో మాత్రం రూ. 108కి అమ్ముతున్నారని, తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు పడుతున్నాయని కానీ తెలంగాణాలో మాత్రం ఈ పరిస్థితి లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల నియామకం జరగలేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఢిల్లీలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోందని బిశ్వా శర్మ అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు లిక్కర్ దందా చేస్తున్నారన్న ప్రచారం సాగుతోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లో నేడు నెలకొన్న పరిస్థితులు ఏంటో గమనించాలని, హిందూ దేవుళ్లను నమ్మని వారి దుస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు. భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ వర్ శక్తివంతమైన దేశంగా మారబోతోందని జోస్యం చెప్పారు. ది కేరళా స్టోరీ ప్రతి ఒక్కరూ చూడాలని, హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా నడిపిస్తున్నారో అందులో చూపించారన్నారు. అస్సోంలో లవ్ జిహాదీని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు.

You cannot copy content of this page