ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా…

ఓటర్ల వివరాలెలా ఉన్నాయంటే..?

దిశ దశ, న్యూ ఢిల్లీ:

దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం మద్యాహ్నం 12 గంటలకు సీఈసీ రాజీవ్ కుమార్ ఈ మేరకు న్యూ ఢిల్లీలోని నిర్వచన్ సదన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మిజోరాం, చత్తీస్ గడ్, మధ్యప్రదేష్, రాజస్థాన్ తెలంగాణాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ ఐదు రాష్టాలలోని 679 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 16 కోట్లకు పైగా ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. ఇందులో 60 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని సీఈసీ ప్రకటించారు. తెలంగాణాలో 3.17 కోట్ల మందిలో 1.58 కోట్లు పురుషులు, 1.58 కోట్ల మంది మహిళలు ఉండగా మొదటి సారి తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు 8.11 లక్షల మంది ఉన్నారు. రాజస్థాన్ లో 5.25 కోట్ల మందిలో 2.73 కోట్లు పురుషులు, 2.52 కోట్ల మహిళలు, కొత్త ఓటర్లు 22.04 లక్షల మంది, మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల ఓటర్లలో 2.88 మంది పురుషులు, 2.52 మంది మహిళలు, 22.04 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. చత్తీస్ గడ్ లో 2.03 కోట్ల మంది ఓటర్లలో 1.01 కోట్ల మంది పురుషులు, 1.02 కోట్ల మహిళలు, 7.23 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లు ఉండగా 4.13 లక్షల మంది పురుషులు, 4.39 లక్షల మంది మహిళలు కొత్త ఓటర్లు 50,611 మంది ఉన్నారు.

గెజిట్ నోటిఫికేషన్ అప్పుడే

నవంబర్ 3న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల కమిషన్ 10వ తేది వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 13న నామినేషన్ పత్రాల స్క్రూటినీ, 15 వరకు విత్ డ్రాయల్స్ కోసం గడువు విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. డిసెంబర్ 5వ తేదిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని షెడ్యూల్ తయారు చేశారు. చత్తీస్ గడ్ లో ఫేజ్ 1లో అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, 20న స్క్రూటినీ, 23 వరకు విత్ డ్రాయల్స్, నవంబర్ 7న పోలింగ్, రెండో విడుత ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21న నోఫికేషన్ విడుదల కానుండగా, 30వ తేదిన నామినేషన్ల దాఖలుకు చివరి రోజు, అక్టోబర్ 31న స్క్రూటినీ, నవంబర్ 2న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు.

You cannot copy content of this page