ఫిబ్రవరి, మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరిలో జరగనుండగా.. నాగాలాండ్ ఎన్నికలు మార్చిలో జరగనున్నాయి.

త్రిపుర ఎన్నికల షెడ్యూల్ విషయానికొస్తే.. జనవరి 21న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. జనవరి 30వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్స్ పరిశీలన జనవరి 31న చేపట్టనుండగా.. ఫిబ్రవరి 2వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు టైమ్ ఇచ్చారు. ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా.. మార్చి 2న కౌంటింగ్ జరగనుంది.

ఇక మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి 31న నోటిఫికేషన్ ఇవ్వనుండగా.. ఫిబ్రవరి 7 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 8న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఫిబ్రవరి 10 వరకు గడువు ఇచ్చారు. పోలింగ్ ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా.. కౌంటింగ్ మార్చి 2న జరగనుంది. మూడు రాష్ట్రాల్లో 180 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ అసెంబ్లీ గడువు మార్చి 15తో ముగుస్తుండగా.. త్రిపుర అసెంబ్లీ గడువు మార్చి 22తో ముగియనుంది. ఇక నాగాలాండ్ అసెంబ్లీ గడువు మార్చి 12తో ముగుస్తుంది. నాగాలాండ్ లో 13,09,651 మంది ఓటర్లు, త్రిపురలో 28,13,478 మంది ఓటర్లు, మేఘాలయలో 21,61,129 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయతో పాటు కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఎన్నికల కోలాహలం నెలకొలనుంది. దీంతో ఈ ఏడాది దేశంలో రాజకీయ వేడి మరింత పెరగనుంది. వచ్చే ఏడాది ఏపీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

You cannot copy content of this page