Telangana police: చిట్ ఫండ్ సంస్థకు కరీంనగర్ పోలీసుల భారీ ఝలక్…

ఆస్తులు జప్తు చేస్తూ ఆదేశాలు…

దిశ దశ, కరీంనగర్:

ఇష్టారీతిన చిట్ ఫండ్ కంపెనీలు ప్రారంభించి సభ్యులను చేర్పించుకుని డబ్బులు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న సంస్థలకు కరీంనగర్ పోలీసులు భారీ ఝలక్ ఇచ్చారు. కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు… ఆస్తులు కూడా జప్తు చేస్తామని తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చిట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఇష్టారీతిన చిట్స్ స్టార్ట్ చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకుంటున్న తీరుపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. చిట్ సంస్థలకు సంబంధించిన ఆస్తులు జప్తు చేసేందుకు తెలంగాణా ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్స్, డిపాజిటర్ల రక్షణ చట్టం 1999 (19off 1999) సెక్షణ్ 5 ప్రకారం ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. చిట్ ఫండ్ సంస్థలు ఏర్పాటు చేసి కోట్లలో డిపాజిట్లు వసూలు చేసి చేతులెత్తేసినా వదిలిపెట్టేది లేదని వారి ఆస్తులను జప్తు చేసి మరీ సభ్యులకు న్యాయం చేస్తామని చేతల్లో చూపించారు కరీంనగర్ పోలీసులు. ఈ మేరకు సీఐడీ డీజీపీ ద్వారా కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డిపాజిటర్లకు బాసటగా నిలిచేందుకు GO Rt No. 101 of Home (Passports) Department, dt. 07-02-2025 of Spl. Chief Secretary, Secretary to Government, Hyderabad) జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అక్షర చిట్ ఫండ్ సంస్థలకు సంబంధించిన పలు ఆస్తులను జప్తు చేసినట్టు సీపీ అభిషేక్ మోహంతి ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని రూ. 11 కోట్ల 50 లక్షల విలువ చేసే 50 ఎకరాల భూమి, వెలిచాల గ్రామంలోని రూ. 2 కోట్ల 70 లక్షల 66 వేల 600 విలువ చేసే 24,606 చదరపు గజాల భూమిని జప్తు చేశామని తెలిపారు. ఈ మొత్త విలువ రూ. 14 కోట్ల 27 లక్షల 66 వేల 689 రూపాయలు ఉంటుందని తెలిపారు. కరీంనగర్ రాజీవ్ చౌక్ లోని అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్, అక్షర టౌన్ షిప్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల పేరిట సభ్యులను చేర్పించుకుని వారు చెల్లించిన చిట్ డబ్బులు తిరిగి చెల్లించకుండా అధిక వడ్దీ ఆశ చూపించి పలు చోట్ల భూములు కొనుగోలు చేశారని సీపీ వివరించారు. తమ డబ్బులు తిరిగి చెల్లించాలని సభ్యులు అడిగితే ఇవ్వకుండా అర్థాంతరంగా సంస్థలను మైసి వేసి సభ్యులను మోసగించారని తెలిపారు. సంస్థ ఛైర్మన్ హన్మకొండ వడ్డేపల్లి ఎస్బిహెచ్ కాలనీకి చెందిన పేరాల శ్రీనివాస రావు (49), డైరక్టర్లు హన్మకొండ వడ్డేపల్లి ఎస్బిహెచ్ కాలనీ కి చెందిన పేరాల శ్రీ విద్య, హన్మకొండ గోపాలపూర్ కు చెందిన సూరనేని కొండలరావు (45), హన్మకొండ ఖాజిపేట్ విష్ణుపురి కి చెందిన పుప్పాల రాజేందర్ (47), అలువుల వరప్రసాద్ గొనె రమేష్ లపై గత సంవత్సరం కరీంనగర్ వన్ టౌన్ లో కేసులు నమోదు అయ్యాయి. ఆరు కేసుల్లో అరెస్ట్ అయిన వీరు ఎక్కడెక్క ఆస్తులు కూడబెట్టారో ఆరా తీసిన పోలీసులు వారిని కస్టడీకి తీసుకున్నారు. అనంతరం అక్షర చిట్స్, టౌన్ షిప్ ఛైర్మన్, డైరక్టర్లకు సంబంధించిన కార్యాలయాలు, ఇండ్లలో సోదాలు నిర్వహించి ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను, డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఈ ఆస్తలను జప్తు చేయాలని కోరుతూ సీఐడీ డీజీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీ అభిషేక్ మోహంతి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడంతో అక్షర టౌన్ షిప్స్ ఆస్తులను అటాచ్ చేస్తున్నామని సీపీ ప్రకటించారు.

You cannot copy content of this page