సౌత్ ఇండియా రికార్డు బ్రేక్ చేసిన సింధూ…తెలుగు రాష్ట్రాలకే తల మానికం…

దిశ దశ, హైదరాబాద్:

ద్రాద్రి జిల్లాకు చెందిన సింధూ ఎయిర్ పోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గేమ్స్ లో తన ప్రతిభను కనబర్చారు. ఆల్ ఇండియా జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధూ రెడ్డి సింగిల్స్, డబుల్స్ విభాగంలో ఛాంపియన్ గా నిలిచారు. ఇంతకాలం నార్త్ ఇండియాకే పరిమితం అయిన ఈ రికార్డుల పరంపరకు సింధూ బ్రేకులు వేశారు. భద్రాద్రి జిల్లా రెడ్డిపాలెంకు చెందిన సింధూ అటు క్రీడల్లోనూ ఇటు చదువుల్లోనూ రాణిస్తున్నారు. ఖరగ్ పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సింధూ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. బ్యాడ్మింటన్ రంగంలో తనదైన ప్రతిభను చాటుకుంటున్న సింధూకు ఏడాది బాబు కూడా ఉన్నాడు. బిడ్డకు తల్లి అయినప్పటికీ తనలోని క్రీడల్లో తన ప్రతిభను చాటుకోవడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. అటు విధి నిర్వహణలో తలమునకలవుతూ… ఇటు కుటుంబాన్ని చూసుకుంటూనే బాడ్మింటెన్ క్రీడాకారిణిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఎయిర్ పోర్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బ్మాడ్మింటన్ టోర్నమెంట్ సాగుతున్నాయి. ఈ పోటీల్లో సింధూ రెడ్డి సింగిల్స్, డబుల్స్ విభాగంలో చాంపియన్ గా నిలిచారు. ఎయిర్ ఫోర్స్ నిర్వహించే టోర్నీల్లో ఇంతవరకు నార్త్ ఇండియాకే ఛాంపియన్ షిప్ దక్కేది. కానీ ఈ సారి అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ దక్షిణాది రాష్ట్రాలు అందులో తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా సింధూ చాంపియన్ షిప్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ టోర్నీల్లో  సౌత్ ఇండియాకు చెందిన మహిళా క్రీడాకారిణి తన ప్రతిభను చాటుకోవడం కూడా ఇదే తొలిసారి కావడం మరో విశేషం.  సింధూ తండ్రి భద్రాచలం ఐటీసీలో ఉద్యోగం చేస్తుండగా తల్లి గృహిణి కాగా ఆమె మాత్రం స్వతహాగా క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఎప్పటికప్పుడు తనలోని ప్రతిభకు పదును పెట్టుకుంటూ సక్సెస్ బాటలో కొనసాగుతున్నారు. సింధూ చాంపింయన్ షిప్ సాధించడం పట్ల ఆమె మామ కరీంనగర్ కమిషనరేట్ లో ఎస్సైగా పనిచేస్తున్న లక్ష్మారెడ్డి అభినందించారు. ఎయిర్ ఫోర్స్ అథారిటీ గేమ్స్ లో తొలిసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు తరుపున ఛాంపియన్ షిప్ అందుకున్న సింధూను ఎయిర్ పోర్టు అధికారులు కూడా అభినందించారు. జాతీయ స్థాయిలో ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు లభించడం వెనక సింధూ పడిన శ్రమను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఇదే స్పూర్తితో సింధూ మరిన్ని టోర్నీల్లో చాంపియన్ షిప్ గా నిలవాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page