ఆంధ్రా కానిస్టేబుళ్ల పెత్తనం… సీఐకి చెప్పినా వేధింపులే…

మీడియాకు లీకులిస్తూ టార్గెట్ చేశారు..

ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్

దిశ దశ, ఖమ్మం:

వారం రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించారు. పోలీస్ స్టేషన్ నుండి అదృ‌శ్యం అయిన ఆయన మహబూబాబాద్ జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం అర్థరాత్రి మృత్యువు ఒడిలో చేరిపోయారు. దీంతో పోలీసు విభాగంలో విషాద ఛాయలు అలుముకుంది. అయితే ఎస్ఐ శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎస్సై చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి…

కానిస్టేబుళ్ల పెత్తనం…

తమ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆంధ్రా, తెలంగాణ కానిస్టేబుళ్ల పెత్తనం పెరిగిపోయిందని తనకు సహాయ నిరాకరణ చేశారని ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ వివరించారు. స్టేషన్ కు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టే విషయంలో తనకు సపోర్ట్ గా నిలబడకూదని భావించిన కానిస్టేబుళ్లు పలువురు స్టేషన్ కు సంబంధించిన సిస్టం వర్క్, రికార్డులు రాయడం, డబ్బా రైటర్లు మథ్య గొడవ పెట్టుకుని కావాలని నేను చెప్పే పనిని పూర్తి చేయలేదన్నారు. వారిని ఇదేంటని అడిగితే మీరు ఎవరినైనా పెట్టుకోండి తాము పని చేయమని బ్లాక్ మెయిల్ చేశారన్నారు. నేను బాగానే చూసుకుంటున్నాను కదా… మీరు మీరు గొడవ పడి నా వర్క్ ఎందుకు ఆపుతున్నారని అడిగాను. వారికి అప్పగించిన పనులు కాకుండా జనరల్ డ్యూటీ చేస్తుండడంతో ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరిని పెట్టుకుని స్టేషన్ వర్క్ చేయిస్తున్న క్రమంలో తాము పని చేయం మరోకరితో చేయించమన్న రీతిలో కానిస్టేబుళ్లు వ్యవహరించారన్నారు. అల్టర్నేట్ గా నియమించుకున్న వారిని తిట్టేవారని ఎస్ఐ శ్రీనివాస్ వివరించారు. అక్కడ పనిచేస్తున్న ఇంటలీజెన్స్ కానిస్టేబుల్ తమ్ముడు ఓ తెలుగు దినపత్రిక రిపోర్టర్ అని, ఇంటలీజెన్స్ కానిస్టేబుల్ స్టేషన్ కు వచ్చి వివరాలు తెలుసుకుని మీడియాకు లీకులు ఇచ్చి పేపర్లో రాయించేవారని తెలిపారు. తప్పుడు వార్తలు రాయించారని కావాలని రాయించారన్న విషయాన్ని సీఐకి చెప్తే ఆయన కూడా తననే వేధింపులకు గురి చేశారన్నారు. వారి మాటలు విని సీఐ టార్గెట్ చేసిన తీరు గురించి, స్టేషన్ లో నెలకొన్న పరిణామాల గురించి డీఎస్పీకి కూడా రిపోర్ట్ ఇచ్చానన్నారు. అయితే ఆయన కూడా తాను చెప్పిన అంశాలను పట్టించుకోలేదని, అగ్రవర్ణాలు అయినందున తన గురించి పట్టించుకోలేదన్నారు. తాను వెల్తే కూర్చోబెట్టకుండా నిలబెట్టే మాట్లాడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 25 రోజుల క్రితం కానిస్టేబుళ్ల తీరుపై ఎస్పీకి కూడా నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ విషయాన్ని ఎస్భీఐకి వివరిస్తే ఎస్పీ లీవునుండి రాగానే వాళ్లను ఎదోఒకటి చేద్దామని మాట ఇచ్చారని ఎస్సైఐ శ్రీనివా వివరించారు. సీఐ చిన్న చిన్న విషయాలపై మెమోలు పంపించడం, క్లోజర్స్ పంపిస్తే చిన్న చిన్న అంశాలను ఎత్తి చూపుతు ఫైళ్లు వెనక్కి పంపించేవారన్నారు. ఎన్నిసార్లు సరి చేసి పంపించినా కావాలని రిటర్స్ పంపించేవారని, డిలే ప్రాసెస్ తో కానిస్టేబుళ్ల నుండి వేధింపులు ఎక్కువయ్యయాన్నారు. కొంతమంది కానిస్టేబేళ్లు తిరగబడడం, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లకు కూడా పీసీలు మర్యాద ఇవ్వకపోయేవారన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ కానిస్టేబుళ్లు అలాగే వ్యవహరించేవారని, తాము పని చేయకపోతే పై ఆఫీసర్లు ఒత్తిడి చేస్తే వారినే బ్రతిమాలుడుకుంటామన్న ఆలోచనతో ఇబ్బందులు పెట్టేవారన్నారు.

ఎస్ఐ ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో అక్కడి సీఐతో పాటు మరి కొంతమందిపై పోలీసు అధికారుల విధుల నుండి తప్పించి అటాచ్డ్ చేయడంతో పాటు అట్రాసిటీ యాక్టులో కేసు కూడా నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మరణించడంతో ఆత్మహత్య ప్రేరేపిత కారణాల సెక్షన్లను కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయి.
https://x.com/TeluguScribe/status/1809756099844927571?t=ZTG3ZiSAz7DnLFSlGeAybw&s=08

You cannot copy content of this page