చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
దిశ దశ, కరీంనగర్:
వార్తా సేకరణలో నిమగ్నం అయిన వీడియో జర్నలిస్ట్ పై దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ కు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు చట్టపరంగా నిందితులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఆదివారం ఉదయం కరీంనగర్ మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్ కుంగిపోయిన న్యూస్ కవర్ చేసేందుకు 10టీవీ వీడియో జర్నలిస్ట్ సుధీర్ వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఇన్న ఇద్దరు వ్యక్తులు వీడియో చిత్రీకరణ చేస్తున్న సుధీర్ చేతిలోని మొబైల్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ దాడికి దిగే ప్రయత్నం చేశారు. తాను డ్యూటీలో భాగంగా కేబుల్ బ్రిడ్జి వద్దకు వెల్లి కవరేజ్ చేస్తుండగా కాంట్రాక్టర్ కు సంబంధించిన వారు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని సుధీర్ వివరించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ జర్నలిస్టులకు చెప్పారు. ఏసీపీని కలిసిన వారిలో జర్నలిస్టులు తాడూరి కర్ణకార్, చంద్ర శేఖర్, శరత్ రావు, సంపత్, వెంకట రమణ, సంపత్, రవి, భాస్కర్, సతీష్, చెరుకు గోపాల కృష్ణ, కృష్ణ, వీడియో జర్నలిస్టులు కవి, సంపత్, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post