వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు ఆమెకు నోటీసులు ఇచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. మహబూబాబాద్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. ముందుగా 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చిన పోలీసులు ఆమెపై కేసు నమోదైన సమాచారం ఇచ్చారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post