దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ బృందాలు నగరంలోని వివిధ హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని హోటళ్లలో విక్రయిస్తున్న ఆహారా పదార్థల కోసం ఉపయోగిస్తున్న మెటిరియల్ నాణ్యతా ప్రమాణాలపై ఈ బృందాలు ఆరా తీస్తున్నాయి. గడువు ముగిసిన ఫుడ్ మెటిరియల్ వాడుతున్నారా, మిగిలిన వంటకాలను స్టోర్ చేసి విక్రయిస్తున్నారా అన్న వివరాలను ఈ టీమ్స్ సేకరిస్తున్నాయి ఆయా హోటళ్లలోని కిచెన్, స్టోర్ రూమ్స్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృత శ్రీ నేతృత్వంలోని ఓ బృందం నగరంలోని శ్వేత హోటల్ పై దాడులు చేపట్టింది. ఈ సందర్భంగా రూ. 70 వేల రూపాయల విలువైన ప్రొడక్ట్స్ గడువు ముగిసిన వాటిని గుర్తించినట్టు అమృత శ్రీ వెల్లడించారు. కిచెన్ లో 20 నుండి 25 రకాల వండిన పదార్థలను కూడా గుర్తించామని వివరించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ కు నోటీసులు ఇవ్వడంతో పాటు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.