కరీంనగర్ లో విజి‘లెన్స్’ దాడులు

రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. గురువారం రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఛాట్ బండార్, స్నాక్స్ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టింది. ఆహార పదార్థాల కల్తీతో పాటు పరిశుభ్రతత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయాలను పరిశీలించేందుకు విజిలెన్స్ అధికారులు నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఛాట్ బండార్ లపై దాడులు చేపట్టారు. సడన్ విజిట్ చేసిన అధికారులు ఆహార పదార్థాల తయారీకి వాడుతున్న వంట నూనె, నీరు, ఇతరాత్ర వంట సామాగ్రిని పరిశీలించారు. కరీంనరగ్ విజిలెన్స్ ఎస్పీ జె రామారావు నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో డీఎస్పీ కె శ్రీనివాస్ రావు, ఫుడ్ సేఫ్టి అధికారిణి ఎన్ అనూష, తహసీల్దార్ దినేష్ చంద్ర, ఇన్స్ పెక్టర్లు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించిన విజిలెన్స్ అధికారుల బృందం ల్యాబ్ కు పంపించారు. నివేదికలు వచ్చిన తరువాత నాణ్యతకు తిలోదకాలు ఇచ్చిన సెంటర్ల నిర్వహాకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.

You cannot copy content of this page