ఫించ్ కు అనారోగ్యం…

ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌‌ను గాయం ఇబ్బంది పెడుతోంది. ఐర్లాండ్ తో ఆడుతుండగా మ్యాచ్ మధ్యలో తొడ కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. తొడ కండరాలు పట్టేసినప్పటికీ పించ్ అర్థసెంచరీ పూర్తిచేసుకోవడం విశేషం. సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు అలౌటైంది. దీంతో 42 పరుగుల తేడాతో విజయాన్ని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆనంతరం ఫించ్ మాట్లాడుతూ తాను మ్యాచ్ మధ్యలో కాస్తా ఇబ్బంది పడ్డది నిజమేనని చెప్పాడు. తొడ కండరాలకు సంబందిచి స్కాన్ తీసుకుంటానని, గతంలో కూడా తాను ఇలాగే ఇబ్బంది పడ్డానన్నారు. అయితే ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేకపోయానని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కాన్ తీయించుకుని కండరాల సమస్య తగ్గుముఖం పట్టేందుకు అవసరమైన వైద్యం చేయించుకుంటానన్నారు. తొడ సమస్యతో ఇబ్బంది పడ్డ ఫించ్ స్థానంలో ఆల్ రౌండర్ డేవిడ్ ఫీల్డింగ్ చేశాడు. ఆస్ట్రేలియా శుక్రవారం తదుపరి మ్యాచ్ అఫ్ఘానిస్తాన్‌తో ఆడనుంది.

You cannot copy content of this page