కావేటి పరమేశ్వర్ స్వామికి అరుదైన పురస్కారం
దిశ దశ, కరీంనగర్:
కరీంనగరానికి చెందిన అయ్యప్ప గురుస్వామికి అరుదైన పురస్కారం లభించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప గురు స్వాములకు అవార్డులు ఇచ్చే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టిన సంస్థ ఎంపిక చేసిన వారిలో కరీంనగర్ వాసి ఉండడం విశేషం. నగరానికి చెందిన కావేటి పరమేశ్వర్ గురుస్వామికి అయ్యప్ప సేవా రత్న అవార్డును ప్రధానం చేశారు నిర్వాహకులు. తమిళనాడులోని కంచిపురంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 18మందికి అయ్యప్ప సేవా రత్న అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్, మేనేజింగ్ ఫౌండర్ ట్రస్టీ పిఎస్కే మీనన్, అధ్యక్షుడు అయ్యప్ప దాస్, ప్రధాన కార్యదర్శి భేతి తిరుమలరావులు పాల్గొనగా, దేవాలయ మాజీ మేల్ శాంతులు శశికుమార్, దామెదరన్ నంబూద్రిలు కావేటి పరమేశ్వర్ స్వామికి అయ్యప్ప సేవా రత్న అవార్డును అందజేశారు. అయ్యప్ప దివ్య ఆశీస్సులతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మాల ధారణ చేసే స్వాములు, అయ్యప్ప సేవా సమితి సభ్యుల సహకారంతో తనకీ అవార్డు వచ్చిందని కావేటి పరమేశ్వర్ గురుస్వామి వెల్లడించారు. ఈ అవార్డును తన జీవిత భాగస్వామి కావేటి శైలజ, కరీంనగర్ అయ్యప్ప భక్తులకు అంకితం ఇస్తున్నాని ప్రకటించారు. నిరంతరం అయ్యప్ప స్వామి నామస్మరణతో జీవనం సాగిస్తూ… స్వామి భక్తులకు నిరంతరం సేవ అందిస్తూ తరిస్తానన్నారు.