ఆ పసికందుకు 24 వేళ్లు

దిశ దశ, జగిత్యాల:

సహజంగా జరిగే పరిణామాలకు భిన్నంగా సాక్షాత్కరించినప్పుడు విచిత్రం అనిపిస్తుంటుంది. అత్యంత అరుదుగా సాగే ఘటన ఒకటి కోరుట్లలో జరగడం హాట్ టాపిక్ గా మారింది. వైద్య శాస్త్రంలోనే చాలా అరుదుగా ఎదురైయ్యే ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్యర్యంలోకి ముంచెత్తుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ విచిత్రం ఏంటంటే..? నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం ఏరుగట్లకు చెందిన సుంగారపు రవళి అనే మహిళ ఆదివారం మగశిశువుకు జన్మనిచ్చారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ఈ పసికందుకు రెండు కాళ్లు, రెండు చేతులకు కూడా ఆరువేళ్లు ఉండడం అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. ఐదు వేళ్ల చొప్పున ప్రతి ఒక్కరికి మొత్తం 20 వేళ్ల ఉండడం సహజం. కానీ రవళి కడుపున పుట్టిన పండంటి బిడ్డకు ఆరు చొప్పున మొత్తం 24 వేళ్లు ఉండడం గమనార్హం. మొదట రవళికి నొప్పులు రావడంతో ముందుగా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లగా వైద్యులు అందుబాటులో లేకపోవడం కోరుట్ల అసుపత్రికి తరలించారు. ఆమెకు నార్మల్ డెలివరి చేయగా తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన శిశువును చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. రెండు కాళ్లు రెండు చేతులు అన్నీ ఆరువేళ్లతో జన్మించిన సంఘటన అత్యంత అరుదని వైద్యులు అంటున్నారు. ఏరుగంట్ల గ్రామానికి చెందిన సాగర్, రవళిలు రెండు సంవత్సరాల క్రితం‌ వివాహాం చేసుకోగా తొలిసరి కాన్పులో మగ బిడ్డ జన్మించడంతోనే ఆనందభరితం అవుతుంటే, పుట్టిన బిడ్డకు 24 వేళ్లు ఉండడం అబ్బురమనిపించిందని తల్లిదండ్రులు అంటున్నారు.

You cannot copy content of this page