సారే దునియా ఏక్ తరఫ్… సాలే బౌనే ఏక్ తరఫ్..?

దిశ దశ, వరంగల్:

వరంగంల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోకసభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుండి తప్పుకోవడంతో ఒక్కసారిగా సమీకరాణాలన్ని మారిపోయాయి. దీంతో వరంగల్ నుండి ఎవరిని పోటీలో నిలపాలన్న విషయంపై అధినేత కేసీఆర్ సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బాబు మోహన్ ను బరిలో నిలిపితే ఎలా ఉంటుందన్న విషయంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనకు గురువారం రాత్రే అధినేత కేసీఆర్ నుండి ఫోన్ వెల్లినట్టుగా సమాచారం. బాబు మోహన్ కేసీఆర్ ను కలిసి చర్చించిన తరువాత అభ్యర్థిత్వం ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బాబు మోహన్ గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. తాజాగా ఆయన బీజేపీని వీడి ప్రజాశాంతి పార్టీలో కొనసాగుతున్నారు. అయితే వరంగల్ ఎస్సీ రిజర్వూ నియోజకవర్గం అయినందున ఘంటా చక్రపాణి, రసమయి బాలకిషన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి నేతల పేర్లను కూడా పరిశీలిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బావాబామ్మర్దులు…

కేసీఆర్, బాబు మోహన్ మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ ను బాబు మోహన్ బావా అని సంబోదిస్తారని… మెదక్ జిల్లా పార్టీ శ్రేణులు అంటుంటారు. అప్పుడు టికెట్ నిరాకరించడంతో పార్టీ వీడిన బాబు మోమన్ కు ఇప్పుడు ఎంపీ టికెట్ ఇస్తామన్న ఆఫర్ తో రీఎంట్రీ చేయించాలని అధినేత యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబు మోమన్ తిరిగి గులాభి గూటికి చేరినట్టయితే సారే దునియా ఏక్ తరఫ్… సాలే బౌనే ఏక్ తరఫ్ అన్న నానుడిని నిజం చేసినవారవుతారన్న చర్చ మొదలైంది.

You cannot copy content of this page