కొంతకాలంగా అనారోగ్య కారణలతో బాధపడుతున్నప్పటికీ.. స్టార్ హీరోయిన్ సమంత పలు సినిమాల్లో నటిస్తోంది. అనారోగ్య కారణాలతో సమంత బాడీలో మార్పులు చోటుచేసుకున్నాయి. అనారోగ్య కారణాలతో మానసికంగా కూడా ఈ బ్యూటీ బాధపడుతోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో సమంత నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటించాడు. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కించాడు. అనన్య నాగల్ల,ఇతర నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాలో నటించడంతో.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎందురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ దీనిపై మేకర్స్ నుంచి అదికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్ విడుదలవ్వగా.. అవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని శాకుంతలం నిర్మాతలు భావిస్తున్నారు. అంతలోపే ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినప్పటికీ.. వాయిదా పడిందనే వార్తలు సమంత ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నాయి.