పబ్లిగ్గా బలగం మూవీ వద్దు…

అలా అయితే ఓకే…

జగిత్యాల ఎస్పీకి వినతి

దిశ దశ, జగిత్యాల:

పడుచు పిల్లల నుండి పండుటాకుల వరకూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న బలగం మూవి వారిని ఒంటరిని చేస్తోందా..? కుటుంబ బంధాలు అనుబంధాల గురించి వివరించిన ఈ సినిమా వారికి కొత్త సినిమా చూపిస్తోందా..? ప్రజల్లో చైతన్యం వస్తున్నందుకు సంబరపడాలో లేక సినిమా వల్ల తాము దివాళా తీస్తున్నామని ఆందోళన చెందాలో అర్థం కాని పరిస్థితి వారికి ఎదురవుతోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా తయారైంది బలగం సినిమా ప్రొడ్యూసర్, ధియేటర్ల యజమానుల పరిస్థితి.

పబ్లిక్ ప్లేస్ ల్లో అవకాశం ఇవ్వకండి…

పల్లెలకు పల్లెలు జట్టుకట్టుకుని చూస్తూ అలానాటి మానవ బంధాలను నెమరువేసుకుంటున్నా బలగం సినిమా విషయంలో నిర్మాత నుండి థియేటర్ యజమానుల వరకు ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. దీంతో తాము పెట్టిన పెట్టబడులు రావన్న ఆందోళనలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఓపెన్ ప్లేసెస్ లో బలగం సినిమా చూపిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బలగం సినిమా విషయంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తుండడంతో కొత్త తరహా చర్చకు తెరలేపింది ఈ సినిమా. మార్చి 31న సినిమా దిల్ రాజ్ ప్రొడక్షన్స్ నిజామాబాద్ పోలీసులకు లేఖ రాస్తు… సినిమా ప్రైవసీని కాపాడి ఆర్థికంగా నష్టం రాకుండా చూడాలని కోరారు. అలాగే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన దుర్గ రాజ కళా మందిర్ థియేటర్ యజమాని జగిత్యాల ఎస్సీకి కూడా ఫిర్యాదు చేశారు. సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ప్రదర్శించేందుకు అనుమతించారని ఆయన వివరించారు. అయితే పబ్లిక్ ప్లేస్ లో ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించడం వల్ల థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందన్నారు. దీనివల్ల మూవీ తమ థియేటర్లో ప్రదర్శించేందుకు డబ్బులు పెట్టి తీసుకున్నప్పటికీ లాభం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీ అంటే తమ ఇళ్లలో మాత్రమే కూర్చొని చూడాల్సి ఉంటుంది కానీ ఓపెన్ ప్లేసుల్లో సినిమాను ప్రదర్శించడంవల్ల తమ థియేటర్ల వైపు వచ్చే అవకాశం లేదన్నారు. డబ్బులు తీసుకుని ఓటీటీల ద్వారా బలగం సినిమాను ప్రదర్శిస్తున్న తీరును కట్టడి చేయాలని దుర్గ రాజ కళా మందిర్ థియేటర్ యాజమాన్యం అంటోంది. డబ్బుల కోసం ప్రదర్శిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో బలగం సినిమాను గ్రామాల్లో బహిరంగంగా ప్రదర్శిస్తున్న ఆనవాయితీ పెరుగుతోంది. దీంతో అటు సినిమా ప్రొడ్యూసర్కు, ఇటు థియేటర్ల యజమానులకు తీరని నష్టం వాటిల్లనుండడంతో అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

You cannot copy content of this page