బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ ముగ్గురి అరెస్ట్

సీబీఐ దర్యాప్తు ముమ్మరం

దిశ దశ, ఒడిశా:

ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి సంబంధించిన కేసు దర్యాప్తులో సీబీఐ అరెస్టల పర్వ మొదలైంది. ఈ ఘటనకు బాధ్యులుగా ముగ్గురిని అరెస్ట్ చేసింది. జూన్ 2న బాలసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 293 మంది మరణించిన కేసులో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్స్ వింగ్) అరుణ్ కుమార్ మహాంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్ లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. వీరిపై ఐపీసీ 304, 201 సీఆర్పీసీ సెక్షన్లలో కేసు నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది.

ఫస్ట్ అరెస్ట్ ఇదే…

గత జూన్ 2న జరిగిన ఈ రైల్ ప్రమాదం అంతర్జాతీయ స్థాయిలో సంచనలంగా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు మానవ తప్పిదమే కారణమని, సిగ్నలింగ్ వ్యవస్థను మార్చి ఉంటారని కేంద్ర ప్రభుత్వం, రైల్వే సేఫ్టీ వింగ్ అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సీబీఐని విచారించాలని రైల్వే బోర్డు ఆదేశించడంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందాలు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టాయి. సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్ అదృశ్యం ఆయన ఇంటిని సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో కుట్ర కోణం దాగుందా అన్న విషయంపై సీబీఐ ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి మాత్రం ఈ ప్రమాదానికి ముగ్గురు రైల్వే అధికారులే కారణమని తేల్చినట్టుగా స్ఫష్టమవుతోంది. వీరిపై పెట్టిన సెక్షన్లలో కుట్రకు సంబంధించిన సెక్షన్లను విధించనట్టుగా తెలుస్తోంది. అయితే ఛార్జి షీట్ కోర్టులో దాఖలు చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం సీబీఐ అరెస్ట్ ప్రక్రియ ఈ ముగ్గురు రైల్వే అధికారులతోనే ప్రారంభం అయింది.

You cannot copy content of this page