మమ్మల్ని కాపాడండి మహాప్రభో… వర్దన్నపేటలో నిరసనలు

రామగుండం ఫ్లైయాష్ లారీల ఎఫెక్ట్…

దిశ దశ, వరంగల్:

ప్రధాన రహదారుల పక్కనే ఇండ్లల్లో నివాసం ఉండలేకపోతున్నాం… ఫ్లైయాష్ కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నాం… మమ్మల్ని కాపాడాలంటూ వర్దన్నపేట జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళన  పట్టారు. తాము ప్లైయాష్ బారిన పడకుండా లారీలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రామగుండం నుండి…

పెద్దపల్లి జిల్లా రామగుండం నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వందలాది లారీల్లో ఫైయాష్ తరలిపోతోంది. ఖమ్మం ప్రాంతానికి తరలివెల్తున్న ఫ్లైయాష్ లారీల నుండి జారిపడుతున్న బూడిద వల్ల తాము తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వర్దన్నపేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వర్దన్నపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మరీ నిరసన తెలిపారు స్థానికులు. ఇటీవల కాలంటో తీవ్రంగా పెరిగిపోయిన ప్లైయాష్ లారీల నుండి పడుతున్న బూడిద వల్ల ఊపరితిత్తుల వ్యాధితో పాటు ఇతర వ్యాధులకు కూడా గురవుతున్నామని వారు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా సాగుతున్న ఫ్లైయాష్ రవాణా వల్ల గొంతు సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతున్నాయని ఈ విషయంపై నేషనల్ హైవే అధికారులకు కూడా వివరించినప్పటికీ లాభం లేకుండాపోయిందని వర్దన్నపేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లోనే

రాత్రి వేళల్లో ఇబ్బడిముబ్బడిగా వెల్తున్న లారీల నుండి పడుతున్న ప్లైయాష్ వల్ల జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండ్లన్ని బూడిదమయం అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పగలయితే అభ్యంతరాలు వ్యక్తం అవుతయాని భావించిన కాంట్రాక్టర్లు అర్థరాత్రి వేళల్లో రవాణా చేస్తుండడంతో తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని వివరించారు. ప్రధానంగా లారీల్లో తరలిస్తున్న ప్లైయాష్ బయటకు రాకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రామగుండంలోని ఫ్లైయాష్ ప్లాంట్ రవాణా కాంట్రాక్టర్ లారీల్లో యాష్ నింపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ రహదారులపై జారి పడుతుండడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయోనన్న విషయాన్ని పట్టించుకోవడం లేదని వారంటున్నారు. బూడిద చెల్లచెదరై పడడం వల్ల ఆ రోడ్లపై ప్రయాణించే ఇతర వాహన దారులు కూడా ఇబ్బందులు పడతారని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయన్న విషయాన్ని అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వర్దన్నపేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల్లో తరలించే ఊక కింద పడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని అలాంటిది ఫ్లైయాష్ తరలించే విషయంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. టార్పాలెన్స్ వేయకుండా, లారీ బాడీ చుట్టూ ఉండే చిన్నచిన్న సందుల నుండి యాష్ జారిపోతుందన్న విషయాన్ని గుర్తించకపోవడానికి అసలు కారణమేంటన్నదే మిస్టరీగా మారిపోయందని స్థానికులు అంటున్నారు. ఫ్లైయాష్ లారీలను కట్టడి చేయాల్సిందేనని వర్దన్నపేట వాసులు డిమాండ్ చేస్తున్నారు.

You cannot copy content of this page