దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఉగ్ర సంబంధాలు ఉన్నాయన్న కారణంతో నిషేదంలో ఉన్న ఆ విద్యార్థి సంఘంపై కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు నిషేధం పొడగించింది. UAPA చట్టం ప్రకారం స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధం పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత సౌర్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా ఈ సంస్థ వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదాన్ని పెంపోదించడంతో పాటు శాంతియుత వాతావరణానికి భంగం కల్గించే చర్యలకు పాల్పడుతుండడం, మత సామరస్యానికి తూట్లు పొడుస్తుండడం వంటి చర్యల్లో సిమి పాత్ర ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో సిమిని మరో ఐధేళ్ల పాటు నిషేదం పొడగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.