వరంగల్ కోర్టుకు ‘బండి’ తరలింపు

రిమాండ్ రిపోర్ట్ లో ఎ1గా బండి సంజయ్

దిశ దశ, వరంగల్:

వరంగల్ జిల్లా కోర్టుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని పోలీసులు తరలించారు. మంగళవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందీ పేపర్ లీకయిన కేసులో బుధవారం సంజయ్ ని అరెస్ట్ చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం 11.24 గంటలకు హిందీ పేపర్ ను వాట్సప్ ద్వారా పంపించినట్టుగా వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు తెలిపారు. కానీ అనూహ్యంగా మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ పోలీసులు సంజయ్ ని అరెస్ట్ చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడి నుండి వరంగల్ కమిషనరేట్ కు తీసుకెళ్లారు. మార్గమధ్యలో కమిషనరేట్ సరిహద్దుల్లో సంజయ్ ని వేరే వాహనంలోకి తీసుకెళ్లి అక్కడి నుండి పాలకుర్తి హస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే పరీక్షలు నిర్వహించిన అనంతరం జఫర్ గడ్ ప్రాంతంలో చాలా సేపు వేచి చూసిన పోలీసులు మెజిస్ట్రేట్ వరంగల్ కోర్టు ఆవరణకు చేరుకుంటున్నారన్న సమాచారం అందుకోగానే భారీ బందోబస్తు నడుమ సంజయి్ ని తరలించారు. అయితే హన్మకొండ అదాలత్ వద్ద భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వాహనాలకు అడ్డంగా బీజేపీ కార్యకర్తలు వెల్లారు. ఈ క్రమంలో జనంలోంచి వాహనాలపై చెప్పులు విసిరారు. అయితే పోలీసులు అడ్డుగా ఉన్న వారిని చెదరగొట్టి సంజయ్ ని కోర్టు ఆవరణలోకి తీసుకెల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

ఎ1గా బండి సంజయ్

మంగళవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసులో బుధవారం బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు వరంగల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో బండి సంజయ్ ని ఎ1గా, ఎ2గా బూర ప్రశాంత్, ఎ3గా గుండెబోయిన మహేష్, ఎ5గా మౌతం శివలను పేర్కొన్నారు. ఇందులో ఒక మైనర్ కాగా మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు కోర్టుకు విన్నవించారు. వీరిపై ఐపీసీ 120(బి), 420, 447, 505((1)(బి), సెక్షన్ 4(ఎ), 6 రెడ్ విత్ 8 ఆప్ టిఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్) యాక్ట్ 1997 సెక్షన్ 66 డిఐటీ యాక్టుల ప్రకారం కేసు నమోదు చేసినట్టు కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page