ప్రధాని మోడీని కలిసిన ‘బండి’ ఫ్యామిలీ

దిశ దశ, న్యూఢిల్లీ:

జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ గురువారం ప్రధానం నరేంద్ర మోడీని కలిశారు. న్యూ ఢిల్లీలో తన కుటుంబ సభ్యులతో కలిసి వెల్లిన సంజయ్ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్న సంజయ్ తన భార్య అపర్ణ, కుమారులు సాయి భగీరథ్, సాయి సుముఖ్ లతో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రానున్న బండి సంజయ్ కి ఘనంగా సన్మానించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్కడి నుండి నేరుగా కరీంనగర్ చేరుకోనున్న సంజయ్ జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు, తన అభిమానులను కలవనున్నారు.

అధికారమే లక్ష్యంగా పని చేయండి: ప్రధాని

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని బండి సంజయ్ ని ప్రధాని మోడీ ఆదేశించారు. మరింత కష్టపడి ప్రజల్లో ఉంటూ పార్టీని పటిష్టం చేసే దిశగా కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కోసం శ్రమించిన తీరును అభినందించిన ప్రధాని మోడీ ఎన్నికల వరకు పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించాలాన్నరు. ఈ సందర్భంగా సంజయ్ కుమారులు ఏం చదువుతున్నారు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని.

You cannot copy content of this page