అమిత్ షా తో ‘బండి’ భేటి…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోకసభకు హాజరైన సందర్భంగా అమిత్ షా ఛాంబర్ లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇటీవల బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష్య బాధ్యతల నుండి తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంజయ్ ని తొలగించడంపై పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అమిత్ షా ప్రత్యేకంగా సంజయ్ తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత కూడా రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్న నేపథ్యంలో సంజయ్ తో అమిత్ షా ఏం చర్చించారన్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి మండలిలో సంజయ్ కు ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నందున ఈ విషయంపై చర్చకు వచ్చిందా లేక రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవాలి, అధ్యక్ష్య బాధ్యతలు తప్పించడానికి గల కారణాలతో పాటు ఇతరాత్ర అంశాలపై మాట్లాడి ఉంటారని తెలుస్తోంది. త్వరలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి ముగ్గురు కీలక నేతల ఆధ్వర్యంలో పాదయాత్రకు కూడా రాష్ట్ర బీజేపీ చేపట్టే యోచనలో ఉన్నందున సంజయ్ పాదయాత్ర గురించి కూడా చర్చించి ఉంటారా లేక, వంద రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఉన్నందున ఈ ప్రోగ్రాంలో ముఖ్య పాత్ర పోషించాలని సంజయ్ కి సూచించి ఉంటారన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా సంజయ్ ని మార్చిన తర్వాత అమిత్ షా ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page