మహదేవపూర్ కు “బండి”

దిశ దశ, మహదేవపూర్:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం మహదేవపూర్ లో పర్యటించనున్నారు. ఆదివారం మద్యాహ్నం మహదేవపూర్ చేరుకోనున్న బండి సంజయ్ ఇటీవల మరణించిన బీజేపీ మండల కార్యదర్శి మంథని రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. బీజేపీ పార్టీ సభ్యత్వ సేకరిస్తున్న సమయంలో గుండె పోటుకు గురైన రాజేందర్ హఠాన్మరణం చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్ మరణించిన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మహదేవపూర్ రావాలని నిర్ణయించుకున్నారు. కేరళ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమం షెడ్యుల్ ఉండడంతో ఆయన మహదేవపూర్ పర్యటనకు ఆలస్యం అయింది. 

You cannot copy content of this page