నడ్డా పిలుపుతో ఢిల్లీకెళ్లిన ‘బండి’

దిశ దశ, హైదరాబాద్:

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. వరంగల్ లో ప్రధాని మోడీ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం అనంతరం కరీంనగర్ చేరుకోవల్సిన సంజయ్ అనూహ్యంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ వెల్లిపోయారు. ఉదయం ఢిల్లీ నుండి సంజయ్ కి ఫోన్ రాగానే ఆయన ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లారు. మరో వైపును ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ భేటీ కూడా ఉండడంతో సంజయ్ కి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారిక వ్యవహారాలకైతే పీఎంఓ నుండి సంజయ్ కి పిలుపు వచ్చేది కానీ పార్టీ చీఫ్ నుండి కాల్ రావడంతో ట్విస్ట్ చోటు చేసుకుందా అన్న చర్చ మొదలైంది. అయితే సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుండి తప్పిస్తే మాత్రం పార్టీ పూర్తిగా వీక్ అయిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇవ్వడంతో పాటు మరికొంత మంది ప్రత్యామ్నాయం చూసుకుంటామన్న సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకులు కూడా బండి సంజయ్ కి అనుకూలంగా ఉండడం, సంఘ్ పరివార్ కూడా ఆయన మార్పును వ్యతిరేకిస్తున్న అంశాలన్ని క్రోడీకరించుకుని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. నడ్డాను కలిసిన తరువాత ఆయన ఏం చెప్తారోనన్నదే తేలాల్సి ఉంది.

You cannot copy content of this page