దూకుడు పెంచిన బండి సంజయ్

దిశ దశ, కరీంనగర్:

ఏడు సెగ్మెంట్లలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం తీసుకవచ్చే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారాయన. ఎంపీ ఎన్నికల నాటికి గ్రౌండ్ లెవల్లో పటిష్ట పర్చుకోవాలన్న లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు. లోకసభ పరిధిలో కేంద్రం నుండి మంజూరు చేయించిన నిధుల వివరాలను కూడా ప్రజలకు చేరవేయాలని భావిస్తున్నారు. తాజాగా ఏడు సెంగ్మెంట్లలోని పార్టీ శ్రేణులతో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసి క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.

వ్యూహాలకు పదును…

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులు కార్యక్షేత్రంలోకి దిగాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికల సమరాంగణంలోకి దూకిన సంజయ్ బూత్ లెవల్లో పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. రానున్నలోక సభ ఎన్నికల నాటికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ప్రచారం విస్తృతంగా జరగాలని సంకల్పించిన ఆయన ఆ దిశగా క్యాడర్ ను పురామాయిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు కేంద్రం ద్వారా ఇప్పించిన నిధులకు సంబంధించిన వివరాలను కూడా పార్టీ శ్రేణులకు ఇచ్చి తాము చేసిన అభివృద్ది గురించి ముందస్తుగానే వివరాలించాలని సంజయ్ సూచించారు. గ్రామ గ్రామాన కూడా అభివృద్ది పనులకు సంబంధించిన చర్చ జరిగే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. శనివారం ఏడు సెగ్మెంట్లలోని  పార్టీ బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయిన బండి సంజయ్ పలు అంశాలను వారికి వివరించారు. జాతీయ భావమే కాదు కేంద్రం ద్వారా నిధులు ఇప్పించడంలోనూ ముందు వరసలో నిలిచిన విషయాన్ని ప్రజలకు చేరవేసినట్టయితే సునాయసమైన విజాయాన్ని మరో సారి అందుకోవచ్చని బండి సంజయ్ అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ ముందస్తుగా పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ప్రజల్లోకి ముందుగానే చొచ్చుకుని వెల్లినట్టయితే ప్రత్యర్థి పార్టీలు వెనకపబడిపోతాయమని ఎన్నికల నాటికి తనకు లాభిస్తుందన్న భావించిన సంజయ్ ఇప్పుడే కార్యరంగంలోకి దూకారని తెలుస్తోంది. గతంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన ప్రాంతాల్లోని ప్రజలతో మమేకం అయ్యేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నెలఖారున లోకసభ పరిధిలోని 20వేల మంది పార్టీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏడు సెగ్మెంట్ల పరిధిలోని పార్టీ క్యాడర్ ను ముందుగానే సమాయత్తం చేసి సానుకూల ఫలితాలు రాబట్టేందుకు కదనంరంగంలోకి దూకారు.

రానున్న ప్రభుత్వంలో కీ రోల్…

ఈ సారి లోకసభలో అడుగుపెట్టగానే బండి సంజయ్ కి కూడా పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని క్యాడర్ చెప్తోంది. ఈ సారి గెలిచిన తరువాత ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం రానున్నందున ఆయన గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్రీయాశీలకంగా పనిచేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్త చేస్తున్నాయి. తాజాగా జరిని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ లో టఫ్ ఫైట్ ఇచ్చిన నేపథ్యంలో జాతీయ నాయకత్వం కూడా ఆయనపై ప్రత్యేక దృష్టి సారించిందని అంటున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ గా బండిని తప్పించిన తరువాత పార్టీ తీవ్రమైన నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ సారి సంజయ్ గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టే విషయంలో ప్రధాని మోడీ సహా ముఖ్య నాయకులు కూడా ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంజయ్ కి మెజార్టీ ఇప్పించినట్టయితే అన్నింటా లాభం చేకూరుతుందని పార్టీ శ్రేణులు బావిస్తున్నాయి.

You cannot copy content of this page