బీసీలకు రూ. లక్ష అప్లై చేసుకోండిలా…


వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి గంగుల

దిశ దశ, హైదరాబాద్:

కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బీసీ సామాజిక వర్గాల వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విది విధానాలను తయారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ వృత్తులపై ఆధారపడ్డ వారికి లక్ష సాయం స్కీంను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు అర్హులైన వారు https://tsobmmsbc.cgg.gov.in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారు తమ ఫోటో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలను వెంట తీసుకుని ఆన్ లైన్ లో అప్లికేషన్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 38 కాలమ్స్ ఉన్న ఈ దరఖాస్తులో వివరాలను పొందు పర్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం లక్ష సాయం అందించనుంది.

You cannot copy content of this page