టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి ఈ రోజు రాత్రి 8.30 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని నటి మంచు లక్ష్మి ఇంట్లో జరగనుంది. ఇప్పటికే పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో పెళ్లి కావడంతో కొంతమంది అత్యంత సన్నిహితులు, బంధువులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. దివంగత రాజకీయ నేతలైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డితో మనోజ్ ఏడడుగులు నడవనున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం తాళి కట్టి పెళ్లి చేసుకోనున్నాడు.
గత కొంతకాలంగా మౌనికా రెడ్డితో మనోజ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ జంట సహజీనవం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. బయట కూడా ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. దీంతో మౌనికా రెడ్డితో తన పెళ్లి త్వరలోనే ఉంటుందని మంచు మనోజ్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎట్టకేలకు మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు.
ఇవాళ పెళ్లి జరగనున్న క్రమంలో ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించాడు. భార్య మౌనిక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మనోజ్.. ‘పెళ్లికూతురు భూమా మౌనిక అంటూ ట్వీట్ చేశాడు. అలాగే మనోజ్ వెడ్స్ మౌనికా
అనే హ్యాష్ ట్యాగ్‌ని కూడా షేర్ చేశాడు. మనోజ్ పెళ్లిని మంచు లక్ష్మి తన చేతుల మీదుగా చేస్తోంది. పెళ్లి బాధ్యతలను తన భూజాలపై వేసుకుని చేస్తోంది. మనోజ్ ను పెళ్లి కొడుకును చేయడంతో పాటు అన్నీ పనులు చేస్తోంది.
అయితే మంచు లక్ష్మి ఇంట్లోనే మంచు మనోజ్ పెళ్లి చేయడం వెనుక ఒక కారణం ఉందని అంటున్నారు. తమ్ముడు మనోజ్ అంటే మంచు లక్ష్మికి చాలా ఇష్టం. తాను ఒక కొడుకులా మనోజ్‌ను భావిస్తానని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అలాగే భూమా కుటుంబంతో కూడా మంచు లక్ష్మికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన ఇంట్లోనే మంచు లక్ష్మి పెళ్లి చేయాలని నిర్ణయించుకోగా.. అందుకు ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.